మహిళను గర్భవతిని చేసిన గ్రహాంతరవాసి: సంచలనం రేపుతున్న పెంటగాన్ రిపోర్ట్

  • ఏలియన్స్ పై ఎప్పటి నుంచో ఎన్నో కథనాలు
  • ఏలియన్స్, హ్యూమన్స్ మధ్య సెక్సువల్ ఎన్ కౌంటర్లు జరిగాయంటున్న పెంటగాన్ రిపోర్ట్
  • ఓ వ్యక్తి వేసిన సమాచార హక్కు పిటిషన్ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం
గ్రహాంతరవాసుల గురించి ఎప్పటి నుంచో ఎంతో చర్చ జరుగుతోంది. ఏలియన్స్ ను ప్రత్యక్షంగా కొందరు చూసినట్టు, వారు ప్రయాణించే ఫ్లయింగ్ సాసర్లను చూసినట్టు ఎన్నో కథనాలు ఉన్నాయి. గ్రహాంతర వాసుల గురించి ఎన్నో ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఏలియన్స్ మానవులతో శారీరక సంబంధాలను కూడా కలిగి ఉన్నాయని, వారి కారణంగా ఒక మహిళ గర్భవతి అయిదనే వార్త ఇప్పడు సంచలనంగా మారింది. 

అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిపోర్టులో ఏలియన్ కారణంగా ఒక మహిళ గర్భం దాల్చిందని ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్త ‘ది సన్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఓ వ్యక్తి వేసిన సమాచార హక్కు పిటిషన్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది.

ఈ రిపోర్టు 1,500కు పైగా పేజీలను కలిగి ఉంది. కనీసం ఐదు సార్లు ఏలియన్, హ్యూమన్ సెక్సువల్ ఎన్ కౌంటర్లు జరిగినట్టు రిపోర్టులో ఉంది. ఒక మహిళ గర్భవతి అయినట్టు రిపోర్టు పేర్కొంది. ఏలియన్స్ ను, వాళ్లు ప్రయాణించే ఎగిరే పళ్లాలను చూసిన వారు అసాధారణ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్టు తెలిపింది. జుట్టు రాలడం, తలనొప్పి, పీడ కలలు, చర్మంపై కాలిన గాయాలు, గుండె దడ, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పింది. ఫ్లయింగ్ సాసర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఇలా జరిగుండొచ్చని తెలిపింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ వార్త సెన్షేషనల్ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking