మానవత్వాన్ని చాటుకున్న ప్రభుత్వ విప్ గువ్వల దంపతులు

దోమలపెంట(అమ్రాబాద్): నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజాసేవకే అంకితమైన ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.నాల్గవ సోమవారం సందర్భంగా శ్రీశైల ఉత్తర ద్వారముఖ ఉన్న శ్రీఉమామహేశ్వర దేవస్థానంలో కార్తీక దీపారాధన పాల్గొని అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొని స్వామి వారికీ మొక్కులు చెల్లించుకున్న అనంతరం తిరిగి శ్రీశైలం దైవదర్శనానికి బయల్దేరుతున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారి దంపతులు బయల్దేరగా దోమలపెంట గ్రామ సమీపంలోని మార్గమద్యలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకోన్నాయి.అందులో ప్రయాణించే వారికి తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న క్రమంలో మార్గమద్యలో పోతున్న గువ్వల దంపతులు వెంటనే గమనించి ఆపి వారికి సాయం అందించారు.వెంటనే గాయాలపాలైన వారందరినీ తన కారులో ఎక్కించుకుని దోమలపెంట జెన్కో హాస్పిటల్ కీ దగ్గరుండి తీసుకెళ్ళారు.అక్కడ హాస్పిటల్లో గాయాలు పాలైన వారందరినీ దగ్గరుండి చికిత్స చేయించారు.తీవ్రగాయాలపాలైన వారిని మెరుగైన వైద్యం కోసం సొంత ఖర్చులతోనైన చికిత్స చేయించాలని తనతో పాటు వచ్చిన నాయకులను వారిని తీసికెళ్ళి దగ్గరుండి చికిత్స చేయించండి అంటూ వారికీ సూచించారు.రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని చూసి చూడనట్లు ఉండే ఇప్పటి రోజుల్లో తన కారు ఆపి వారిని చూసి సొంత కారులో ఎక్కించుకోనిపోయి వైద్యం అందించడం కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే గారి ఆప్యాయతకు అక్కడ ఉన్న పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మానవత్వానికి మారుపేరుగా నిలిచారని వారు అనుకుంటున్నారు.రోడ్డుపై ప్రయాణిస్తున్న ఎవరు అయిన ఇలా రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వారిని దగ్గరుండి చూసుకోవడంలోనైన లేక ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడంలోనైన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గారు అంకితభావంతో అతుక్కున చేర్చుకుంటారని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గాయాలపాలైన వారిని మెరుగైన వైద్యం కోసం తన ఖర్చులతోనైన సరే చేయిస్తా ముందు అయితే తీసుకెళ్లండి అంటూ తన మనుషులు పంపి వారిని దగ్గరుండి హాస్పిటల్ కీ పంపించారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking