మున్సిపల్ సిబ్బంది చెట్లు నరుకడంపై వార్డు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో మున్సిపల్ సిబ్బంది చెట్లు నరుకడంపై వార్డు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కోట్లు ఖర్చు చేసి హరితహరం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతుంటే, మరో పక్క చెట్లు నరికి వేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య మాట్లాడుతూ కౌన్సిలర్ అయిన నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డా విద్యుత్ తీగలు లేని ప్రాంతాల్లో చెట్లు ఎందుకు నరుకుతున్నారని కమిసినర్ ను అడిగితే చైర్మన్ పేరు చెప్పి తప్పించుకోవడం బాధాకరం అన్నారు. జిల్లా కలెక్టర్ కు మరియు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని అన్నారు..ప్రజా నేత్ర ప్రతినిధి రాజేంద్రప్రసాద్.

Leave A Reply

Your email address will not be published.

Breaking