మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు. Smd. యూనుస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దుల్హన్ స్కీం నమోదు పెండ్లి జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోగా గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.దీని కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజుల నుంచి 60 రోజుల్లోపు నమోదు చేసుకుంటే రూ.100 రుసుం చెల్లించాల్సి ఉంటుం ది. మూడు నెలలు దాటిటే రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 చెల్లిస్తే అధికారులు మీ ఇంటికి వచ్చి వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడుతారు.గతంలో పంచాయతీ కార్యదర్శుల కొరత ఉండడంతో ఒక్కొక్కరికీ మూడు నాలుగు పంచాయతీల బాధ్యతలను చేపట్టారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పంచాయతీలన్నింటికీ కార్యదర్శులను ఉండాలనే నిబంధన ఉండడంతో అన్ని పంచాయతీలకు పూర్తి స్థాయిలో కార్యదర్శులను నియమించింది. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి అందుబాటులో ఉండడంతో ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ నమోదు తప్పని సరి చేసింది.వివాహ రిజిస్ట్రేషన్‌తో అనేక ఉపయోగాలు వివాహానికి చట్టబద్ధత, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సహాయం, భర్త చనిపోతే వితంతు పింఛన్, భర్త నుంచి విడిపోయే సందర్భాల్లో భరణం పొందేందుకు అవకాశం ఉంటుంది, బాల్య వివాహాల నిర్మూలన, రెండో వివాహాన్ని అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రేమ పేరిట మోసాలు, రహస్య పెండ్లిలు, రుజువులేని వివాహాల రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే వారికి భార్యాభర్తలుగా పరిగణించబడుతారు. మూడు పద్దతుల్లో వివాహ నమోదు..!
వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం మూడు పద్దతులను పాటించాలని ఆదేశించింది. నూతన విధానంలో వధూవరులకు వివాహ మెమోరాండం అందజేసి పూర్తి వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేయాలి. ఇందు కోసం ఆధార్‌కార్డు, పెళ్లి శుభలేఖ, పెళ్లి ఫోటోలు, ముగ్గురు సాక్షుల సంతకాలు తీసుకున్న తర్వాత వారికి వివాహా ధృవపత్రం అందచేస్తారు. ఇందులో పాల్గొన్నవారు దేవ నగర్ వసీం అనీఫ్ సలాం భాష.నిమయత్ అలీ ఖాన్ నందమూరి నగర్ నూర్ భాషా నడిగడ్డ మహమ్మద్ కైఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.