యేసయ్య కృప మనందరి పై చల్లగ ఉండాలని వేడుకుంటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు

పెనిమిళ్ల ఉప్పునుంతల ఈనెల 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవుణ్ణి ఆశీర్వాదంతో 100రోజులు ఉపవాసం ఉండి నేడు దీక్ష విరమించుకున్న సందర్భంగా మండల పరిధిలోని పెనిమిళ్ల గ్రామంలో ఆనంద క్రిస్మస్ పండుగ అనే కార్యక్రమాన్ని పాస్టర్ మనేమ్మ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హాజరై దేవుణ్ణి కృప అందరిపై ఉండును గాక, నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో సాయం చేయడంమే దేవుణ్ణి ఆశీర్వాదం అని వారు అన్నారు.కార్యక్రమం అనంతరం దేవుణ్ణి కృపతో పేదలకు మనేమ్మ గారు దాదాపు 40మంది మహిళలకు చీరల పంపిణీ ఎమ్మెల్యే గారి చేతులమీదుగా పంపిణీ చేయించి అనంతరం మేరీ క్రిస్మస్ కేక్ కట్ చేయించి దీక్ష విరమించి కేక్ తినిపించి సంబరాలు చేసుకున్నారు .కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటయ్య, జెడ్పీటిసి అనంత ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ జక్క చంద్రశేఖర్ రెడ్డి, MRPS తాలూకా ఇంచార్జ్ అంతటి మల్లేష్, మరియు ఫేర్రి, చిన్నా, అశోక్, వెంకటయ్య మరియు గ్రామస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా ఁపజానేఁత న్యూస్ బ్యూరో శేఖర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking