రేపల్లె పట్టణం ఆర్బికెల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం ఆర్బికెల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం – యాడ్ చైర్మన్ గడ్డం కోటేశ్వరమ్మ .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్థిక సంస్థల ద్వారా రైతులు పండించిన పంటను కొనుగోలు ప్రారంభించినట్లు యార్డ్ చైర్మన్ గడ్డం కోటేశ్వరమ్మ గారు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మార్కెట్ యార్డులో కొనుగోలు ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను తాము సహకారం చేస్తామన్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యాడ్ డైరెక్టర్లు, రేపల్లె పట్టణ వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు గడ్డం. రాదా కృష్ణమూర్తి గారు, మరియు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు…రేపల్లె ప్రజానేత్ర శ్రీకాంత్

Leave A Reply

Your email address will not be published.

Breaking