రైతు,కార్మిక,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దాచూరి రామిరెడ్డి భవన్లో నూతన వ్యవసాయచట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో పోరాడుతూ మరణించిన 33 మంది రైతులకు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం “నూతనవ్యవసాయచట్టాలు- పర్యవసానాలు”అంశం పై స్టడీ సర్కిల్ నిర్వహించారు.సీఐటీయూ మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ స్టడీ సర్కిల్ లో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు వై.సిద్ధయ్య మాట్లాడుతూ ఉద్యమంలో మరణించిన రైతుల స్పూర్తితో వారి త్యాగాలు వృధా కాకుండా అండగా నిలవాలి అన్నారు.సీఐటీయూ జిల్లా నాయకుడు పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ రైతు పోరాటానికి సంఘీభావంగా 21 న పోస్ట్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో రైతు సంఘం నాయకులు కొల్లూరి వెంకటేశ్వర్లు,పులి ఓబులరెడ్డి, వ్యవసాయకార్మిక సంఘం కార్యదర్శి కంకణాల వెంకటేస్వర్లు,kvps కార్యదర్శి తొట్టెంపూడి రామారావు,సీఐటీయూ నాయకులు ఇట్టా నాగయ్య,పాలేటి ఏడుకొండలు,కేతా శ్రీను,యూటీఫ్ నాయకులు ఎన్. వెంకటేస్వర్లు, పి.వెంకటేస్వర్లు,డి.రాము తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి ఎన్ ప్రసాద రావు.