రైతుల ఆందోళనకు మద్దతుగా కొవ్వొత్తులతో నిరసన- బోయినపల్లి రైతులు

వెల్దుర్తి మండలంలోని బోయినపల్లి రైతులు సిఐటియు నాయకులు దశరథ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ , సిఐటియు మండల నాయకులు రాజు మాట్లాడుతూ ఎముకలు కొరికే చలిలో సహితం పోరాడుతున్న రైతు సంఘాల పోరాటానికి సంఘీభావంగా రైతులు కొవ్వొత్తులతో బోయినపల్లి లో నిరసన తెలియజేసిన ఐదు లకు అభినందనలు తెలియజేశారు. కష్టంగా మారుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు కనీసం మద్దతుధర ఇస్తామని చట్టంలో పెట్టకపోవడం అభ్యంతరకరమని తెలియజేశారు. రైతులకు స్వేచ్ఛ ఇవ్వడం కాదు ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకోవడమే అని విమర్శించారు. ఈ చట్టాలు 3 కూడా కేవలం విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకు రైతులు పండించిన పంటలన్నీ కారుచౌకగా కట్టబెట్టి రైతుల అందరినీ వారి పొలాల్లో వారిని కూలీలుగా మార్చడానికి ఈ చట్టాలు తీసుకొచ్చారని విమర్శించారు. 21 రోజుల నుంచి పోరాడుతున్న రైతులకు అన్ని గ్రామాల్లో కొవ్వొత్తులతో నిరసన తెలియజేసి 21వ తేదీ మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రాముడు ,చిన్న రాజు, మనోహర్, కృష్ణ, మద్దయ్య, శ్రీ రాములు, సుబ్బారెడ్డి, దుబ్బన్న, బోయినపల్లి రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.

Leave A Reply

Your email address will not be published.

Breaking