కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లోని సుదెపల్లె గ్రామానికి చెందిన మాల ఎర్రమల , వయసు 38 సం.లు అనే వ్యక్తి బైక్ మీద డోన్ వైపు వెళ్తుండగా సోమాపురం స్టేజ్ సమీపాన గుర్తుతెలియని వాహనం వెనక వైపు నుండి ఢీకొట్టడంతో స్వల్పగాయాలయ్యాయి. అక్కడున్న ప్రజలు వెంటనే 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా డోన్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఇంకా మెరుగైన చికిత్స కొరకు అదే 108 అంబులెన్స్ ద్వారా కర్నూల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి తరలించారు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి .