లక్షెట్టిపేట లో సిపిఐ మండల కౌన్సిల్ సమావేశం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 05 మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట లో సిపిఐ మండల కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి రామానుడు లక్ష్మణ్,ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి,ఈ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ కౌన్సిల్ సమావేశంలో స్థానిక సమస్యలపై చర్చించి తదుపరి కార్యాచరణ పై మాట్లాడుకోవడం జరిగింది, తర్వాత నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది, నూతన కమిటీ మండల కార్యదర్శిగా మేదరి దేవవరం,సహాయ కార్యదర్శిగా కేతిరెడ్డి రమణా రెడ్డి,కోశాధికారిగా లింగంపల్లి భాను చందర్, కార్యవర్గ సభ్యులుగా దుర్గం దేవదాసు,ఆవునూరి వెంకటేష్,రాచర్ల రవి కిరణ్, ఆకుల రామన్న, బైరి రాజన్న,తిప్పని సత్తన్న, చింతల ఐలయ్య,జూల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking