లొద్దలపేట గ్రామంలోని శ్రీలక్ష్మీ పేరంటాలు ఆరాధనోత్సవం

శ్రీకాకుళం, పొందూరు,ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని ఆమదాలవలస మండలంలోని లొద్దలపేట గ్రామంలోని శ్రీలక్ష్మీ పేరంటాలు ఆరాధనోత్సవాలలో భాగంగా శనివారం జరిగిన శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళ వాయద్యాలతో ఊరేగింపుగా జరిగిన ఈ శోభాయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కళశాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందసమారాధనలో భాగంగా తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.పూజారి రాధాకృష్ణ శ్యామల దంపతులు అన్న సమారాధన జరిపించారు.సాయంత్రం సత్సంగసుధ మరియు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లొద్దలపేట గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాలైన తాడివలస, బెలమాం, గండ్రేడు, వెంకంపేట తదితర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గురుగుబెల్లి వెంకటరావు,ప్రజానేత్ర – రిపోర్టర్,

Leave A Reply

Your email address will not be published.

Breaking