గజపతినగరం జిల్లాలో 653 కోట్లతో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.బుధవారం మధ్యాహ్నం గజపతినగరం సి.హెచ్.సి ఆస్పత్రి ఆవరణలో వంద పడకల ఆసుపత్రి భవనం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందేలా చేస్తామని ఆయన అన్నారు.అలాగే విజయనగరంలో 500 కోట్లతో మెడికల్ కళాశాలను నిర్మిస్తామని దానికి సంబంధించిన భూసేకరణ కూడా పూర్తయిందని దానికి కూడా త్వరలోనే శంకుస్థాపన కూడా చేస్తామని అన్నారు.రాష్ట్రంలో కొత్తగా 355 పట్టణాల్లో ఆస్పత్రులు నిర్మిస్తామని తొందరలో టెండర్లు కూడా పిలుస్తామని చెప్పారు.ప్రస్తుతం గజపతినగరం సి హెచ్ సి లో 16 మంది వైద్యులు 24 మంది సిబ్బంది పని చేస్తున్నారని దీనిని వంద పడకల ఆసుపత్రిగా పూర్తి అయిన సమయానికి ఐదుగురు సర్జన్లు, ఒక ఆర్.ఎమ్ ఒక డిప్యూటీ సర్జన్ పోస్టులు కూడా వస్తాయని చెప్పారు.ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని ,పక్కా ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు.డిసెంబర్ 25వ తేదీన ఎన్నడూ లేని విధంగా అర్హులైన పేదలందరికీ ఒకేసారి 30 లక్షల ఇల్లు అందచేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ,జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ ,సాలూరు శృంగవరపుకోట ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర ,కడుబండి శ్రీనివాసరావు ,డి సి హెచ్ ఎస్ జి. నాగభూషణం ,ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అరుణ దేవి ,వైసిపి నాయకులు మాజీ జడ్పీటీసీలు గార.తవుడు,మక్కువ శ్రీధర్ ,మాజీ సర్పంచులు మండల సురేష్ ,బెల్లాన త్రినాధ రావు ,సామంతుల పైడిరాజు,బూడి. వెంకటరావు,కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు ..బిరుసు ఎర్నాయుడు..రిపోర్టర్.