– రూ.50 వేలకు మించి నగదు ఉంటే పత్రాలు సమర్పించాలి
– వెహికల్ చెకింగ్‌లో జమ్మికుంట పట్టణ సీఐ రవి
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 3 : లోక్ సభ ఎన్నికల వేళ పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని కాకతీయ బిల్డింగ్ సమీపంలో వెహికల్ చెకింగ్ లో భాగంగా బుధవారం పట్టణ సీఐ వరగంటి రవి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజలు రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దని సూచించారు. ఒకవేళ తీసుకెళ్తే అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. రూ.50 వేలకు మించి నగదు ఉండి పత్రాలు సమర్పించనిచో నగదును సీజ్ చేసి కలెక్టరేట్ ట్రెజరీకి పంపిస్తామని వెల్లడించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న క్రమంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మద్యం తాగి వాహనాలు,నడపకూడదని ట్రిపుల్ రైడింగ్ మైనర్లుకు వాహనాలకు ఇవ్వరాదని సూచించారు. ఈ తనిఖీల్లో జమ్మికుంట పోలీసులు కేంద్ర బలగాలు పాల్గొన్నారు.