యావత్ మంది భారతీయులు గర్వించేలా చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2023 ఆగస్టు 23 న మన ‘చంద్రయాన్ 3’ ల్యాండర్ విక్రమ్ ఫొటోను రోవర్ ప్రజ్ఞాన్ ఈ రోజు ఉదయం 7.35 గంటలకు తీసి పంపింది, తాజాగా దీన్ని ఇస్రో ట్విట్టర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు పోస్ట్ చేయడం జరిగినది, ల్యాండర్ విక్రమ్ ఫోటోను చూసి యావత్ భారత్ దేశం 140 కోట్ల ప్రజలు గర్విస్తున్నారు, చంద్రుడిపై ఇండియా పాగా వేసేలా చేసిన విక్రమ్ను అందరూ అభినందిస్తున్నారు, రోవర్ ప్రజ్ఞాన్ తనలో ఉన్న నావిగేషన్ విక్రమ్ లాండర్ క్లిక్ కెమెరాతో ఈ ఫొటోను తీసింది, ఈ కెమెరాను బెంగళూరుకి చెందిన ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ కంపెనీ తయారు చేసి చంద్రుడిపై ల్యాండ్ అయినప్పటి నుంచి ల్యాండర్ కు సంబంధించి రిలీజ్ అయిన మొదటి ఫోటో, ఇప్పటివరకు రోవర్ ఫోటోలను ల్యాండర్ విక్రమ్ తీసి పంపగా, తాజాగా రోవర్ తన కెమెరాతో ల్యాండర్ ఫోటోలను తీసి పంపింది. ట్విటర్‌లో విక్రమ్ ల్యాండర్ ఫొటోని షేర్ చేస్తూ ఇమేజ్ ఆఫ్ ది మిషన్ అంటూ ఇస్రో కామెంట్ చేసిందని సామాజిక వర్గ ప్రజా కార్య కర్త అందె లక్ష్మణ్ రావు తెలియ జేయడమ్ జరిగినది.