వృద్దురాలికి చేయూత

భద్రాద్రి కొత్తగూడెం ఇటీవల కాలములో ఆమెర్ధ గ్రామములో పిల్లి వరం అనే వృద్దురాలి పూరిగుడిసె, పూరిగూడిసెలోని బట్టలు, వంట సామాగ్రి వస్తువులు, మంచం మరియు ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోగా ఆ వృధురాలుకు చేయూతగా ముస్లిం మైనారిటీ సంక్షేమ సమితి సేవా సంస్థ ( MMSS ) వారి ఆధ్వర్యంలో ఆ ముసలవ్వకు ఒక మంచం, వంట పాత్రలు, బట్టలు, దుప్పట్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ యాకుబ్ ఆలి, జీల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ పాషా, మండల కార్యదర్శి షేక్ అబ్దుల్ అజీజ్, కోశాధికారి ఎండి నాగుల్ పాషా, ఆర్గనైజింగ్ కార్యదర్శి అంజద్ పాషా, ఇంఛార్జి షేక్ సత్తార్, మైనారిటీ నాయకులు నజీర్ షోను, మాలమహానాడు జిల్లా కార్యదర్శి కాలవ సంసోన్, సహయ కార్యదర్శి మేకల భాస్కర్, జూపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking