శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయము నందు మంథని నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్చార్జి పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గారి కూతురు వివాహ పత్రికను స్వామివారి చెంత పెట్టి వారి పేరు పై పూజలు జరిపించి,వారి యొక్క నూతన దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ని వేడుకున్న జయశంకర్ *భూపాలపల్లి జిల్లా తెరాస యువజన నాయకుడు జక్కు రాకేష్ .ఈ కార్యక్రమంలో వారితో పాటుగా ఎంపీపీ రాణి బాయ్ గారు,పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి గారు, ఎంపీటీసీ మమత గారు, మంథని నియోజకవర్గ ఎస్సీ సెల్ ఇన్ ఛార్జ్ భూపెళ్లి రాజు గారు, పలిమల మండల తెరాస పార్టీ అధ్యక్షులు జవ్వాజి తిరుపతి గారు,నాయకులు రామారావు గారు,నాగరాజు గారు,సమ్మిరెడ్డి గారు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ వీరగంటి శ్రీనివాస్.