శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం అయోద్యలో జరుగుతున్న శ్రీ రామ మందిరానికి సంబందించిన శ్రీ రామ జన్మ భూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ ద్వారా శ్రీ రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ ఏర్పాటు చేయడం జరిగింది.. రణస్థలం మండలం లో మొదటి సమావేశం ఈ రోజు నదుకుటి ఈశ్వరరావు క్యాంపు కార్యాలయంలో జరిగినది. ఈ సమావేశంలో నిధి సమర్పణ విది విదానాలు చర్చించడం జరిగినది. రణస్థలం మండలం లో ప్రతీ గ్రామంలో కూడా కమిటీలు వేసుకొని, ఆ కమిటీలో చేరిన కార్యక్రమం ద్వారా గ్రామంలో వున్న ప్రతీ హిందువు దగ్గర నుండి నీది సమర్పణ జరిగే విదంగా వుండాలని సూచించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బిజెపి ఇన్ చార్జ్ నదుకుటి ఈశ్వరరావు RSS శ్రీ KV రమణ విజయనగరం విభాగ్, శ్రీ మేడూరి శేషగిరి రావు రణస్థలం విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార సహ ప్రముఖ శ్రీ పొగిరి సూర్యనారాయణ,హిందూ పరిషత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.