శ్రీ సీతా రామ చంద్ర స్వామి దర్శనానికి విచ్చేసిన ,ఎస్కే కాజా గౌస్ ఉద్దీన్ ,మాధవ్ గౌడ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేడు స్థానిక ఎన్జీవో భవన్ నందు కేంద్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు ఎస్కే కాజా గౌస్ ఉద్దీన్, ప్రధాన కార్యదర్శి మాధవ్ గౌడ్ గార్లు భద్రాచల శ్రీ సీతా రామ చంద్ర స్వామి దర్శనానికి విచ్చేసినారు, ఈ సందర్భంగా టిఎన్జీవోస్ డివిజన్ అధ్యక్షులు డెక్క నరసింహారావు మర్యాదపూర్వకంగా వారిని కలిసి సాధారంగా టీఎన్జీవోస్ భవన్ కు ఆహ్వానించి శాలువా పూలదండ మరియు మెమెంటో తో వారిని ఘనంగా సత్కరించటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మాట్లాడుతూ భద్రాచలం ఉద్యోగస్తులు ఎప్పుడూ మాకు ఆత్మీయులనీ ఇట్టి వారి సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకు వచ్చినట్లయితే అట్టి సమస్యను క్షేత్ర స్థాయిలో త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గగ్గురి బాలకృష్ణ , గజ్జల శ్రీనివాస్, గద్దల నరసింహారావు, అపర్ణ తదితర జిల్లా కార్యవర్గం పాల్గొనడం జరిగింది.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking