సద్దాం కుటుంబాన్ని పరామర్శించిన హైకోర్ట్ అడ్వకేట్ ఉమేష్ చంద్ర

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన మహమ్మద్ సద్దాం తాత మహమ్మద్ పకీర్ డిసెంబర్ 17 గురువారం రోజున అనారోగ్యంతో మరణించడంతో విషయం బెస్త నరేష్ ద్వారా తెలుసుకొని అంత్యక్రియల కోసం పదివేల రూపాయలు పంపడమే కాకుండా నేడు హైదరాబాద్ నుండి సద్దాం స్వగ్రామానికి చేరుకొని సద్దాం తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు, హైకోర్ట్ అడ్వకేట్ ఉమేష్ చంద్ర సార్ ను చూడడానికి, అభిమానులు బ్రహ్మరథం పట్టారు, తదనంతరం ఎల్లారెడ్డిపేటలో హైకోర్ట్ అడ్వకేట్ ఉమేష్ చంద్ర సార్ కు సన్మానం నిర్వహించారు,దీనిలో భాగంగా అనగారిన వర్గాలు అందరూ ఏకమై రాజ్యాధికారం సాధించాలని, ప్రతి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని, ఆయన అడుగుజాడల్లో యువత పయనించాలని తెలియజేస్తూ, దళితులు బహుజనులు ప్రభుత్వం పెడుతున్నటువంటి వేధింపులకు భయపడవద్దని చట్టప్రకారం న్యాయస్థానంలో అన్ని విధాల నా వంతు సహకారం అందిస్తానని భరోసా కల్పించారు, తదనంతరం ఇల్లంతకుంట మండలం రామోజీ పేట గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు, ఇట్టి కార్యక్రమంలో బత్తుల రామ్ప్రసాద్, బెస్త నరేష్, మంగలి చంద్రమౌళి, సుడిదీ రాజేందర్, రాజ్ కుమార్ అడ్వకేట్, అంబటి రవి, అంతెర్పుల సతీష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking