సమస్యల పరిష్కారానికి బస్తీ బాటకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అచ్చంపేట పట్టణాన్ని సుందరీకరణ చేయడంలో అన్ని వార్డులలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేసేందుకు బస్తీ బాట పట్టడం కోసం శ్రీకారం చుట్టడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చంపేట పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారించడం కోసం కలిసికట్టుగా కృషి చేసి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామని వారు.అచ్చంపేట నియోజకవర్గంను శస్యశ్యామలం చేయడం కోసం మిగిలిపోయిన కాల్వలను పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ తో అనేక సార్లు చెప్పడం జరిగిందని వారు అన్నారు.కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు ఇవ్వడం కోసం అన్ని విధాల కృషి చేస్తున్నానని వారు అన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ కొంత ఆలస్యం అయినప్పటికీ ఎక్కడ స్థలం ఉంటే వారికి నగదు రూపంలో ఇచ్చి ఇండ్ల నిర్మాణం చేపట్టాడానికి ప్రభుత్వం కంకణబద్దులై ఉందని వారు అన్నారు.ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్ట్ ల విషయంలో ఆలస్యం కావడం కోసం కాళ్ళల్లో కట్టేలు పెట్టే విధంగా కాంగ్రెస్, బిజెపి పార్టీలు కోర్టులో కేసులు వేస్తూ ఆపుతున్నారని ఎవ్వరూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేసే ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని వారు అన్నారు.నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పథకంలో ముందుకు పోతుంటే ఓర్వలేని వివిధ రాజకీయ పార్టీల నేతలు విమర్శలు వారి విజ్ఞత కే వదిలేస్తున్నామని వారు అన్నారు.వెనుక బడిన అచ్చంపేట ప్రాంతంలో అనేక మంది నిరుపేదలు ఉంటే జిల్లా లోనే ఏకైక 100 పడకల హాస్పటల్ గా మంజూరు చేయించి నిర్మాణం జరుగుతుంటే దానిపై కూడా విమర్శలు చేయడం సిగ్గు చేటు అని వారు అన్నారు.పాత బస్తీ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయడం కోసం ఇక కంకణబద్దులై కలిసికట్టుగా పని చేస్తూ ప్రజలు కోరుకునే అభివృద్ధి తో ముందుకు పోతామని వారు అన్నారు.కరోనా సమయంలో ఆపత్కాలంలో కూడా మీకు అండగా నిలిచి నా వంతు సాయంగా ఆదుకోవడం జరిగిందని వారు గుర్తు చేశారు.నిత్యావసర సరుకుల విషయంలో నాణ్యమైన సరుకులు ఇప్పించి ఆపత్కాలంలో కూడా మీ తమ్ముడు గా మీ అన్నగా మేము ఉన్నామని ప్రతి పల్లెల్లో ప్రతి గూడెంలో అందించిన ఘనత టీఆర్ఎస్ పార్టీ, నాదే నని దాతల సహకారంతో కూడా ఆదుకోవడం జరిగిందని వారు గుర్తు చేశారు.వరదల సమయంలో రోడ్లపై వర్షపు నీరు వచ్చినప్పుడు మునిసిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది కూడా ఎంతో కష్టపడి క్లియర్ చేశారు వారికి నిజంగా దన్యవాదాలు తెలియజేయాలని వారు అన్నారు.మార్కెట్ సమీపంలో రోడ్ల నిర్మాణం వెడల్పు చేస్తూ అభివృద్ధి లో తీసుకుపోవడం జరిగింది.డ్రామా రాజకీయాలు చేస్తూ ప్రభుత్వం పై నాపై చేస్తే ప్రజల ఉసురు చిరు వ్యాపారుల ఉసురు తాకి వాళ్ళు కనుమరుగైనారని వారు గుర్తు చేశారు.రోడ్డు ఇరుక్కుని ఉండడంలో అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ చిరు వ్యాపారులతో మాట్లాడి మెప్పించి రోడ్డు వెడల్పు తో అభివృద్ధి జరుపుకున్నామని వారు తెలియజేశారు.కోర్టు ముందు చిరు వ్యాపారులు ఇరుకున ఇబ్బంది గా వాళ్ళతో మాట్లాడి కూడా క్లియర్ చేయించి మొక్కలు నాటిన ఘనత టీఆర్ఎస్ పార్టీ దే అని వారు అన్నారు.ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధులు ప్రజల అవసరం కోసం ప్రజా సంక్షేమం కోసం అచ్చంపేట పట్టణ అభివృద్ధి కోసం పాటు పడుతూ ముందుకు పోతున్నాము తప్పితే అవకతవకలు జరగడానికి వీలు లేదని వారు అన్నారు.క్రీడల విషయంలో కూడా ఎన్టీఆర్ స్టేడియంలో కూడా లైటింగ్ తో పాటు స్టేడియం ను అభివృద్ధి చేస్తూ క్రీడలతోనే మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుందనే విధంగా కృషి చేస్తానని వారు అన్నారు.మున్సిపాలిటీ లో జరిగిన 8గ్రామాలను కూడా మళ్ళీ యధావిధిగా ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా తీర్చి దిద్దిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీదే, నాదే నని వారు గుర్తు చేశారు.అచ్చంపేర ప్రజలకు అన్ని విధాల అందుబాట్లో ఉంటూ ప్రజల మెప్పు కోసం ఆపద లో ఉన్న వారికి ఆదుకోవడం కోసం అందుబాట్లో ఉండే విధంగా క్యాంప్ ఆఫీస్ కట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదే నని వారు అన్నారు.పట్టణంలోని పలు కాలనీలో ఉన్న మోరి కాలువలు, డ్రేనేజీ, విద్యుత్ స్థంభాల, సిసి రోడ్ల నిర్మాణంలో కూడా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని వారు అన్నారు.ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ఎవ్వరూ పట్టింపు చేసుకోక పోయిన వారిపై పోరాటం చేస్తూ ధర్మాసనం తో ఆత్మగౌరవం చాటడానికి మనమంతా కలిసి అభివృద్ధి చేసుకుందాం అని వారు.అభివృద్ధి విషయంలో అచ్చంపేట అన్ని రంగాల్లో ముందుకు పోవాలని అన్ని విధాల అభివృద్ధి జరగాలని దానికి పార్టీ ప్రతిఒక్కరూ కూడా పనిచేయాలని అన్నారు.కలల సాకారం విషయంలో అలసత్వం జరపకుండ ముందుకు పోతూ అచ్చంపేట ఖ్యాతిని పెంపొందించడం కోసం అచ్చంపేట ను సిద్దిపేట సరసన చేర్చడం కోసం కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ ప్రతిఒక్కరూ కూడా అచ్చంపేట అభివృద్ధిలో కంకణ బద్దులై పని చేసి మరోసారి అచ్చంపేట 20/20 చరిత్రను పునరావృతం చేయాలని వారు పార్టీ ప్రజాప్రతినిధులకు, ముఖ్యులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి అద్యక్షులు పోకల మనోహర్, మునిసిపల్ చైర్మన్ తులసి రాం, వైస్ చైర్మన్ బంధం రాజు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్, మండల అద్యక్షులు నర్సింహ గౌడ్, మరియు అన్ని వార్డుల కౌన్సిలర్ లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking