సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

ఆదిలాబాద్ జిల్లా CPI కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ గజెంగులా రాజు అధ్యక్షతన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్యాతిథిగా కామ్రేడ్ ఎస్ విలాస్ గారు పాల్గొని S మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వెతీరే క విధానాలకు నిరసనగా జిల్లాలో సమ్మె విజయవంతం అయిందని ,కార్మిక సంఘాల పిలుపు మేరకు సమ్మెకు మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలకు రైతు సంఘాల నాయకుల కు విప్లవాభివందనాలు AITUC తరపున తెలియ చేస్తూ,కేంద్రంలో BJP ప్రభుత్వం దేశ భక్తి పేరుతో దేశములోని ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు ఇన్సూరెన్స్,రైల్వే, ఆ యిల్ ,బీ ఎస్ యన్ యల్,డిఫెన్స్,అంతరిక్షం సంస్థలను విదేశీ ,స్వదేశీ కార్పొరేట్ లకు అనుకూలంగా చేయడం దేశ ద్రోహం అవుతుంది కానీ దేశ భక్తి ఎట్లా ఐతదని అన్నారు. కార్మికుల చట్టాలను కార్మికులకు అనుకూలంగా చేయాలని,విద్యుత్ బిల్లు రద్దు చేయాలని,కనీస వేతనం 21 000 ఇవ్వాలని,కనీస పెన్షన్ 10 వేయిలు ఇవ్వాలని,కార్మికుల సమస్యలను పరిష్కరించే దారులు చూపాలని, వెంటనే మూడు రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని అన్నారు. సమ్మెకు సహకరించిన అందరకీ మరోసారి విప్లవాభి వందనాలు తెల్పుతున్నామని అన్నారు. కామ్రేడ్.కుంటాల రాములు మాట్లాడుతూ మున్సిపల్,రిమ్స్,అంగన్వాడీ,సివిల్ సప్లయ్ హమాలీ,బ్లేడ్ ట్రాక్టర్,మధ్యన భోజన కార్మికులకు,అన్ని మండలాల్లో పాల్గొన్న నాయకులకు,కార్మికులకు ,అందరికీ ధన్యవాదాలు తెల్పుతున్నా నని,మా నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం ఖండిస్తున్నాం అని , రాష్ట్రం లో ఎక్కడ జరగ లేదని అన్నారు ఈ కార్యక్రమంలో కా౹౹ సిర్ర దేవేందర్ AITUC ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking