సుబాబుల్ జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

భద్రాద్రి కొత్తగూడెం ; ఐటీసీ బీపీల్ సుబాబుల్ పంట విషయంలో హామీ ఇచ్చిన 4,500 గిట్టుబాటు ధర కల్పించాలని ఇదే విషయాన్ని గతంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సైతం ఐటీసీ బీపీల్ అమలు చేయడం లేదని తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా నిర్వహించారు కలెక్టర్ గారి ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడం పట్ల బిపిఎల్ వైఖరి తెలుస్తుందని ఐటీసీ బీపీల్ యాజమాన్యం రైతులకు హామీ ఇచ్చిన టన్ను కు 4500 రూపాయలు చెల్లించాలని తక్షణం రైతులు అమ్మడానికి సిద్ధంగా ఉన్న పంటను అంత బిపిఎల్ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు ఇది కాకపోతే అఖిలపక్ష రాజకీయ పార్టీల మద్దతు తో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతులు పేర్కొన్నారు కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు నభి గారు ప్రధాన కార్యదర్శి శివ ప్రసాద్ న్యూ డెమోక్రసీ నాయకులు మరియు దాసరి రమేష్ నాయకత్వంలో పాండురంగాపురం రైతులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking