సెక్రెడ్ ఆధ్వర్యంలో మహిళా వికలాంగుల సమాఖ్య ఏర్పాటు

కర్నూలు జిల్లాకృష్ణగిరి మండలం లోని స్థానిక వై.కె.పి కార్యాలయంలో సెక్రెడ్ సంస్థ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన 11 మంది మహిళా వికలాంగులతో కృష్ణగిరి మండల మహిళా వికలాంగుల సమాఖ్యను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెక్రెడ్ కోఆర్డినేటర్ శివశంకర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో మహిళా వికలాంగులు, కుటుంబ పరంగా సామాజికంగా, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారం కోసం మండల స్థాయిలో మండల వికలాంగుల సమాఖ్యను, 21 మండలాల మహిళా వికలాంగుల ప్రతినిధులతో వెన్నెల ప్రాంతీయ వికలాంగుల సమాఖ్యను ఏర్పాటు చేసి, మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మహిళల రక్షణ కోసం గృహహింస నిరోధక చట్టం2005 వంటి మహిళా చట్టాలపై వీరికి శిక్షణనిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.డబ్ల్యూ వీరేషమ్మ, మహిళా వికలాంగుల నాయకులు, దేవి,మహేశ్వరి,మంజుల, రామలక్ష్మి,లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking