రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్ లో వినియోగదారులకు సూచనలు తెలియజేయడం జరిగింది.త్వరలో సెస్ సంస్థకు ఎలక్షన్లు వస్తున్నందున వినియోగదారులు తమ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫోన్ నెంబర్ మీ ఊరు హెల్పర్ కి ఇచ్చి ఓటు హక్కు నమోదు చేయించుకోగలరు. ఇల్లంతకుంట మండలంలోని ప్రతి గ్రామంలో నూతన మీటర్లు బిగించడం జరుగుతుంది కాబట్టి వినియోగదారులు సహకరించగలరు .బిగించిన దానికి ఎటువంటి డబ్బులు ఇవ్వరాదు వారు అడిగిన చొ ae గారికి సమాచారం ఇవ్వాలి. పరిమిషన్ లేని వ్యవసాయ బావుల మోటార్లు నడపరాదు నడిపిన చో తగిన చర్యలు తీసుకోబడును. ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు తమతమ క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఆఫీస్లో ఇచ్చి 100 యూనిట్లు సబ్సిడీ..వినియోగించుకోగలరు. వినియోగదారులు విద్యుత్ బకాయిలు ఉన్నచో వెంటనే చెల్లించి సంస్థ మనుగడకు సహకరించగలరు..ఈ కార్యక్రమంలో AAO జగదీష్ గారు AD శ్రీనివాస్ గారు LI రవీందర్ గారు SA జహీర్ గారు మరియు సెస్ సిబ్బంది పాల్గొన్నారు. బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్.