1256 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం పట్టణంలో విస్తృత తనికీలు, 2 వాహనాలు, 3 ముద్దాయిల పట్టివేత, షుమారు 1,88,49,000/- (1కోటి 88 లక్షల) విలువ గల 1256 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం A.S.P శ్రీ డాక్టర్ వినీత్ గారు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు 14.12.2020 న ఉదయం 07.00 గంటలకు భద్రాచలంలోని అంబెడ్కర్ సెంటర్ వద్ద పట్టణ సిఐ స్వామి గారి ఆద్వర్యంలో, ఎస్.ఐ B.మహేష్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా AP24 TA7869 అనే నెంబర్ గల తుఫాన్ వాహనం ను ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించాము. ఈ తనిఖీల్లో తుఫాన్ నందు 105 కేజీల గంజాయి లభ్యమైంది. దీని విలువ షుమారు 15,75,000/- రూపాయలు ఉండును. ఇందులో ఉన్న ముద్దాయిని విచారించగా తన పేరు ఎడవెల్లి సురేష్, సూర్యాపేట అని ఈ గంజాయిని సీలేరు నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నానని చెప్పినాడు. అలాగే 12.00 గంటలకు సిబ్బందితో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా TS12UC0554 అనే నెంబర్ గల DCM వాహనం ను ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించాము. ఈ తనిఖీల్లో DCM నందు 1151 కేజీల గంజాయి లభ్యమైంది. దీని విలువ షుమారు 1,72,74,000/- రూపాయలు ఉండును. ఇందులో ఉన్న ముద్దాయిలను విచారించగా వారి పేర్లు 1. మహ్మద్ అబ్దుల్ సాజిద్, చేవెళ్ల 2. మహ్మద్ ఫజల్ నవాబ్, హైదరాబాద్ అని ఈ గంజాయిని దారకొండ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నామని చెప్పినారు. భద్రాచలం పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి మరియు మరే యితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ CI స్వామి, ఎస్. ఐ. B. మహేష్, మరియు సిబ్బంది పాల్గొన్నారు..

జోసఫ్ కుమార్ ప్రజానేత్ర రిపోర్టర్ భద్రచలం

Leave A Reply

Your email address will not be published.

Breaking