132/33 కెవి ఉపకేంద్రం మరియు ఇతర 33/11కెవిఉప కేంద్రాలలో శనివారం రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ నిలిపీవేత
ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా జులై 12 : ములుగు జిల్లా పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా తేదీ 13/7/2024 శనివారం రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు 132/33 కెవి ఉపకేంద్రం మరియు ఇతర 33/11కెవిఉప కేంద్రాలలో మరమ్మతులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును. కావున ములుగు, పత్తిపల్లి, కాశీందేవపేట ,మల్లంపల్లి, అబ్బాపూర్, రామచంద్రాపూర్, పందికుంట ,వెంకటాపూర్, లక్ష్మీదేవి పేట ,నర్సాపూర్ ,వెళ్తుర్లపల్లి, గోవిందరావుపేట ,తాడ్వాయి, సమ్మక్క సారలమ్మ ,ఏటూరు నాగారం ,కన్నయ్య గూడెం, రాజుపేట ,ఏకే మల్లారం ,వాజేడు, వెంకటాపురం ఉప కేంద్రాల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది . కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు ప్రకటనలో తెలియజేశారు.