మద్దికెర: ఈనెల 14న మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నరసింహమూర్తి తెలిపారు.బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాన్ని ఆరు క్లస్టర్లుగా విభజించి ఆరు మండల స్థాయి అధికారులైన ఈవో ఆర్ డి మద్దిలేటి స్వామి,ఎం ఈ ఓ రంగస్వామి,ఏ పి ఓ రవీంద్ర, ఏ పి ఎం సూర్య ప్రకాష్,ఐసిడిఎస్ సూపర్వైజర్, అధికార మేజర్ పంచాయతీ కార్యదర్శి శ్రీహరి క్లస్టర్ ఇన్చార్జిగా నియమించామన్నారు. సోమవారం నుండి కరోనా పరీక్షలను నిర్వహించేందుకు వీరా బస్సు ను ఏర్పాటు చేశామని,మండల స్థాయి అధికారులు అందరూ ఆయా గ్రామాలలోని విద్యార్థులకు పరీక్షలు చేయించుకునేందుకు ఆయా గ్రామాల సచివాలయ,వాలంటీర్లు సహకారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్.