ప్రభుత్వానికి 18 ప్రశ్నలు సివిల్ సప్లయ్ శాఖలో అవకతవకపై ముఖ్యమంత్రికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..తేదీ 25-05-2024పౌర సరఫరాల శాఖ లో జరుగుతున్న అవినీతి పై మంత్రి సమాధానం చెప్పలేక దాటేస్తున్నారు.
నేను అనేక ఆరోపణలు చేసాను..ఓక్క దానికి సమాధానం లేదు.
మంత్రి సమాధానం చెప్పలేక అధికారులు,కాంగ్రెస్ నేతలతో ప్రెస్ మీట్ పెట్టించారు.
నాపై హుజూర్ నగర్ లో పోలిస్ కేసు పెట్టించారు.
నేను ఆధారాలతో సహా అవినీతిని బయట పెట్టా.అయినా మంత్రి నుంచి ఉలుకూపలుకు లేదు.
నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి బహిరంగ లేఖ రాస్తున్నా ,లేఖలో 18 ప్రశ్నలను సందించాం.
రన్నింగ్ లో లేని రైస్ మిల్లులకు ధాన్యం ఎలా ఇస్తున్నారు.
కొన్ని రేషన్ షాపు లలో బియ్యం ఇవ్వకుండా కిలో 10 చొప్పున డబ్బులు ఇస్తున్నారు.
సివిల్ సప్లే శాఖ కు మిల్లర్లు చిల్లించాల్సిన డబ్బులు ఎందుకు వసూలు చేయడం లేదు.
రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ రహస్య ఓప్పందం చేసుకున్నారు.
ధాన్యం కొనుగోలు లో 800 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది.
2200 సన్న వడ్లను రైస్ మిల్లర్లకు అమ్మి అదే రైస్ మిల్లర్ల దగ్గర 5700 కు సన్న బియ్యం కొనడం వెనక ఉన్న మతలబు ఏంటి.
వడ్ల కొనుగోలు లో కేంద్రం వాటా ఉంది.
వడ్ల కొనుగోలు పై సీబీఐ ఎంక్వరి జరగాలి.నేను సీబీఐ ఎంక్వరి కోరుతూ లేఖ రాస్తా.
మామీద కాదు లీగల్ కేసులు పెట్టేది.మీమీద మేము పెడతాం.
సీఎం రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటె రిటైర్డ్ జడ్జి తో నిజనిర్దారణ కమిటీ వేయాలి.
ఆధారాలతో సహా ప్రశ్నిస్తే..మంత్రి గా సమాధానం చెప్పాలి.
రాష్ట్రంలో రబ్ ట్యాక్స్ నడుస్తుంది (రేవంత్, ఉత్తమ్, భట్టి)

Leave A Reply

Your email address will not be published.

Breaking