-నేటి నుంచి సిపిఐ రాష్ట్ర స్థాయి సమావేశాలు
15 సంవత్సరాల తర్వాత ఖమ్మంలో
-హాజరు కానున్న నారాయణ, అజీజ్ పాషా, చాడ, కూనంనేని
-ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా సమితి
ఖమ్మం ప్రతినిధి జూన్ 27 (ప్రజాబలం) ఖమ్మం భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు శుక్రవారం ఖమ్మంలో ప్రారంభం కానున్నాయి15 ఏళ్ల తర్వాత జరుగుతున్న సమావేశాలకు ఖమ్మం జిల్లా సమితి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 2009 నవంబరు 8, 9, 10 తేదీల్లో చివరి రాష్ట్ర స్థాయి సమితి సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత మరల రాష్ట్ర సమితి సమావేశాలకు ఖమ్మం వేదిక కానుంది. 28 ఉదయం 10 గంటలకు రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం స్థానిక గిరి ప్రసాద్ భవన్లో ప్రారంభం కానుంది. కార్యదర్శి వర్గ సమావేశ అనంతరం కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 29, 30 తేదీలలో రాష్ట్ర సమితి సమావేశాలు జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా, చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరు
ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరగనున్నాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, కానున్నారు. సమావేశానికి సంబంధించి జిల్లా కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నాయకులకు స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే రాష్ట్ర సమితి సభ్యులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో గత కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశాల్లో రూపొందించనున్నారు ముఖ్యంగా పార్టీ విస్తరణ ప్రచార ఆందోళనల పై దృష్టి సారించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అతిపెద్ద ఆదాయ వనరుగా తలమానికంగా ఉన్న సింగరేణిని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో బొగ్గు బ్లాకుల వేలం పాటను సిపిఐ పూర్తిగా
నిరసిస్తుంది. జూన్ ఐదు నుంచి చేపట్టనున్న ఆందోళనలకు కార్యకర్తలను సన్నద్ధం చేయడంతో పాటు ఆందోళనకు ఒక ప్రణాళికను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాద చర్యలు బిజెపి వైఖరి ని చర్చించి ప్రజా చైతన్యం కోసం కార్యక్రమాలను రూపొందించే అవకాశం ఉంది. అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను -అధిగమించేందుకు ప్రతి సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసే మార్గంలో అనుసరించాల్సిన వ్యూహాలనుఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పార్టీ నిర్మాణం, విస్తృతి పైన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మారిన కాల మాన
ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్మాణాన్ని రూపు దిద్దేందుకు విస్తృత స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర నాయకులు మహ్మద్ మౌలానా, దండి సురేష్ తదితరుల నేతృత్వంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. సమావేశాలు జరిగే సిపిఐ కార్యాలయం, ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ఎర్ర జెండాలు, తోరణాలతో అలంకరించారు.