ఎస్సీలకు 24, ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్లు పెంచాలి
అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు
ఎమ్మెల్యే,డీసీసీ అధ్యక్షురాలకు వినతిపత్రం అందజేత
ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 02 : తెలంగాణాలో కులగణన చేయడం చాలా అభినందనీయమని, బీసీలకు 42,ఎస్సీలకు 24,ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్లు పెంచాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు కోరారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే పీఎస్ఆర్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలకు అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అత్యధికంగా దళితులు,గిరిజనులు,ఆర్థికంగా,రాజకీయంగా,సామజిక రంగాల్లో వెనక బడ్డారని,వారికి న్యాయం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు భైరం లింగన్న,మాజీ మండల అధ్యక్షులు దొంత నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ దమ్మ నారాయణ,పెండెం సత్తన్న,వేల్పుల ప్రేమ్ సాగర్,ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్,చాతరాజు రాజేష్,చాతరాజు శివ,గంధం సందీప్, నీరటి మొగిలి,చెన్న కిరణ్ తదితరులు పాల్గొన్నారు.