జిల్లాలో గాంధీ చిత్రాన్ని వీక్షించిన 48,506 మంది విద్యార్థులు

 

….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ఆగస్టు 24 ప్రజ బలం ప్రతినిధి:
జిల్లాలో ఈనెల 16 నుండి 24 వరకు 12 సినిమా థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించిన గాంధీ చలనచిత్రాన్ని 48,506 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వీక్షించారని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందేలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో 12 థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఆగస్టు 16 నుండి 24 వరకు ప్రదర్శించగా, 48,506 మంది విద్యార్థులు చిత్రాన్ని వీక్షించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆగస్టు 16న 5465 మంది విద్యార్థులు, 17 న 5955 మంది,18 న 6400 మంది, 19 న 6580, 21వ తేదీన 4650 ,22న 6420 మంది, 23న 6765 మంది,
24న 6271 మంది విద్యార్థులు మహాత్మా గాంధీ చిత్రాన్ని తిలకించారని పేర్కొన్నారు. సినిమా ప్రదర్శనలు అన్ని ధియేటర్లలో ప్రశాంతంగా జరిగాయని, ధియేటర్ల యాజమాన్యాలు, విద్యా, పోలీస్ శాఖ, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు గాంధీ చలన చిత్ర ప్రదర్శనలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు తోడ్పాటునందించినట్లు కలెక్టర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking