హాస్పిటల్ ఎండి అసద్ ఖాన్
ఖైరతాబాద్ ప్రజాబలం ప్రతినిధి:వెల్నెస్ హాస్పిటల్, అమీర్ పేట్ 2 సంవత్సరాల వ్యవధిలో 516 బైపాస్ సర్జరీస్ చేసిన సందర్భంగా ఆపరేషన్ చేయించుకున్న వారిని హాస్పిటల్ కి ఆహ్వానించి వారికి అవసరమైన టెస్టులతో పాటు డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే సర్జరీ తర్వాత వారి జీవితం ఎలా ఉందో కనుక్కొని వాళ్లకు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండి అసద్ ఖాన్ మాట్లాడుతూ వెల్నెస్ హాస్పిటల్స్ లో జరిగిన బైపాస్ సర్జరీలలో 99% సక్సెస్ రేట్ ఉందని తెలిపారు. దానితోపాటు హాస్పిటల్ నుంచి ఒక కమ్యూనిటీ కార్డు కూడా లాంచ్ చేయడం జరిగింది దీనిలో అన్ని కన్సల్టేషన్ ఫ్రీ గా ఉంటాయి దానితోపాటు ఫార్మసీలో 10% డిస్కౌంట్ డయాగ్నస్టిక్ సర్వీస్ లో 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి సుమన్ గౌడ్, వివేక్ రెడ్డి, సి టి వి ఎస్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ శృతి ,డాక్టర్ కార్తీక్ ,డాక్టర్ రంజిత మరియు మెడికల్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్, శ్రీనివాస్ మరియు టీం పాల్గొనడం జరిగింది.