సెల్ ఫోన్ పేలి యువకుడి మృతి చెందిన ఘటన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు బంధువులు.

 

మెదక్ తూప్రాన్ జనవరి 9 ప్రాజబలం న్యూస్:-

సెల్ ఫోను పేలి యువకుడు మృతి చెందిన సంఘటన
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలంలోని ఘనపూర్ శివారులో సోమవారం రాత్రి జరిగింది. ఘనాపూర్ శివారులో గల శివంశంకర్ స్టోన్ క్రషర్ లో బ్లాస్టింగ్ సెక్షన్ లో మహారాష్ట్రకు చెందిన ఐదుగురు వ్యక్తులు పనిచేస్తుంటారు. సోమవారం సాయంత్రం వరకు పనిచేసే సుమారు ఏడు గంటల సమయంలో బ్లాస్టింగ్ స్థలం నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో మహారాష్ట్రకు చెందిన సునీల్ కుమార్ సెల్ ఫోన్ మాట్లాడుతుండగా అకస్మాత్తుగా బ్లాస్ట్ అయి తీవ్రంగా పొట్ట భాగం పగిలి పేగులు బయటపడడంతో అనుచరులు అతన్ని తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే తన పరిస్థితి విషమించడంతో గాయాల పాలైన వ్యక్తిని సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పొట్ట తీవ్రంగా గాయాల పాలు కావడంతో మృతి చెందాడు. సెల్ ఫోన్ పేలి యువకుడు చనిపోయాడని బ్లాస్టింగ్ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తూప్రాన్ మండల ఎస్సై శివానందం తెలిపారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి ఒకవేళ సెల్ ఫోన్ పేలినట్లయితే తలభాగం కళ్ళు చెవులు మరియు మొఖం పూర్తిగా పగిలిపోతుందని పొట్ట పగిలి పేగులు బయటికి వచ్చేటంత పవర్ సెల్ఫోన్ కు ఉంటుందా అని గ్రామస్తులు బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని పోలీస్ అధికారులు కేసు దర్యాప్తు చేసి నిజాన్ని నివృత్తి చేయవలసిన అవసరం ఉందని గ్రామస్తులు బంధువులు కోరుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking