నిరాశపర్చిన బడ్జెట్.

సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి.

జమ్మికుంట ప్రజాబల ప్రతినిధి ఫిబ్రవరి 1

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించి ఉసురుమనిపించిందన్నారు. 3 లక్షల కోట్లు బడ్జెట్ పెంచి చూపించినప్పటికీ 11 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకు చూపడం దేశ ఆర్థిక పరిస్థితికి నిదర్శనంగా కనిపిస్తుందన్నారు. పేదరికం నుండి 25 కోట్ల మందిని బయట తీసుకొస్తే ఆకలి సూచికలో 102 వ స్థానం నుండి 107 వ స్థానానికి ఎలా దిగజారిందో చెప్పాలి.
తగ్గుతున్న తలసరి ఆదాయం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.
దేశంలో 30 కోట్ల మంది యువత నిరాశ నిస్పృహల్లో ఉన్నారని వారి అభివృద్ధికి ఎలాంటి చర్యలు లేవన్నారు.
సామాజిక భద్రతలో భాగంగా నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించే ప్రయత్నం కొనసాగిస్తుంది. అందులో భాగంగానే బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లోప్రతి సంవత్సరం నిధులు కోత పెడుతూ వస్తుంది.
దేశవ్యాప్తంగా కూడు, గూడు, గుడ్డ లేని కోట్లాదిమంది ప్రజలు నేటికీ ఉన్నారని వారందరికీ కనీస సౌకర్యాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మోడీ ప్రభుత్వం పేద ప్రజల కష్టార్జితం ద్వారా సంపాదించిన దేశ సంపాదన మొత్తం కూడా సంపన్నులకు, కార్పొరేట్లకు కట్టబెట్టింది.
10 సంవత్సరాల పాలనలో విద్యను వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
వేతన జీవులకు సంఘటిత అసంఘటిత కార్మిక వర్గానికి తీవ్ర నిరాశ ఎదురయింది.
అవినీతిని నిరోధించామని చెబుతున్నప్పటికీ దేశంలో ప్రభుత్వ గణాంకాలే అవినీతి పెరిగిందని ఉదాహ రిస్తున్నాయన్నారు.
మోడీ పాలన దేశ ప్రజలకు స్వర్ణ యుగం కాదని దేశాన్ని దివాలా తీయించిన యుగమని అభివర్ణించారు. నూటికి 60 శాతం ఉన్న రైతాంగాన్ని విస్మరించిందన్నారు. మొత్తంగా ఈ మధ్యంతర బడ్జెట్ దేశ ప్రజలను నిరాశ పర్చినబడ్జెట్ అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking