సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన వైద్యుడు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 28

వైద్యో నారాయణో హరిః అన్నారు.దానికి తగ్గట్టుగా హాస్పటల్ కి వచ్చిన పేషెంట్ కు సి పి ఆర్ ద్వార ఒక ప్రాణం కాపాడారు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు,సిబ్బంది.జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు పర్లపెల్లి గ్రామానికి చెందిన దాదాపు 65 సంవత్సరాల వయసు గల వృద్ధురాలు అనారోగ్య సమస్యల కారణంగా జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి రాగా వచ్చిన 15 నిమిషాల సమయంలోనే ఆమెకి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది.అది గమనించిన వారి కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ సిబ్బందికి తెలియజేయడం జరిగగా వెంటనే స్పదించిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆ వృద్ధురాలికి సిపిఆర్ చేశారు. సి పి ఆర్ చేసిన వెంటనే ఆమె మళ్ళీ తిరిగి స్పృహలోకి వచ్చింది. పేషెంట్ బంధువులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ కు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking