తూప్రాన్ లో ఘనంగా శ్రీ రాముల వారి రథోత్సవ ఊరేగింపు.

రథోత్సవంపైన అర్చకులు వేదపండితులు ఉండాలి.

తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ, ప్రజాప్రతినిధులు,
గ్రామస్తుల తీర్మానం :-

తూప్రాన్, ఎప్రిల్, 24 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ రాములగడ్డ పై స్వయంభువుగా వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీశ్రీశ్రీ సీతారాముల విమాన రథోత్సవం ఘనంగా బుదవారం ఉదయం అంగరంగ వైభవంగా ఊరేగించారు. భక్తుల హర్షధ్వానాలు, మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలు భక్తుల కోలాహలం మధ్య జై శ్రీరాం, జైజై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ రథోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ రామచంద్రల వారి అనుగ్రహం ఉంటే అన్ని విధాల తూప్రాన్ పట్టణ అభివృద్ధి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం తో భక్తి ప్రపత్తులతో ఆలయ రథోత్సవ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ లు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇంత చక్కటి అవకాశం ను దైవ భక్తి, చింతన ఉన్న ప్రజల కోసం ప్రగతి కోసం ఇక మీద ప్రతి సంవత్సరం రథం పై కేవలం వేద బ్రాహ్మణులు మాత్రమే కూర్చొనే సంపాదాయానికి శ్రీకారం చుట్టారు. రథం పై ప్రజా ప్రతినిధులు కానీ, పని బాటల వారు కానీ ఇతర భక్తులు కానీ ఎవరుకూడా ఎక్కకుండా తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణుల అధ్యక్షతన కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజలు, భక్తులు సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ నిర్ణయం తో ఒక నూతన సంప్రదాయ పద్ధతికి అందరూ మద్దతు తెలిపారు. పైగా చైర్మన్ జ్యోతి కృష్ణ లను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. పురాతన కాలంలో వెలసిన మహిమగల రామాలయం మందిరం వద్ద శ్రీ రాముల వారి రథోత్సవ కార్యక్రమం స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ కౌన్సిలర్లు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది. దేవుని కార్యక్రమం సాంప్రదాయ బద్ధంగా జరగాలని ఆశిస్తూ నూతన సాంప్రదాయం, నూతన నాందికి శ్రీకారం చుట్టారు. రాముల వారి రథోత్సవం పై అర్చకులు, వేద పండితులు మాత్రమే కూర్చోవాలని, సంప్రదాయబద్ధంగా నిత్యం దైవారాధనతో ఉంటారని, పద్ధతి ప్రకారం భక్తితో పూజిస్తే తూప్రాన్ పట్టణ అభివృద్ధికి దేవుని యొక్క అనుగ్రహం ఉంటది అని ఆశిస్తూ స్థానిక కౌన్సిలర్ లు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు సమక్షంలో తీర్మానం చేసి పురోహితులను బ్రాహ్మణులను రథోత్సవం పైకి ఆహ్వానించి రథోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోడీప్యాక నారాయణ గుప్త, పల్లేర్ల రవీందర్ గుప్త, నర్సోజి , గ్రామ పెద్దలు గడ్డం సత్తయ్య , మామిండ్ల లింగం, తూప్రాన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు లెక్చరర్ శ్రీనివాస్ చారి, తిమ్మాపురం నరసింహులు ముదిరాజ్, దుర్గం నాగేష్, ధనరాజ్, బోల్లు నాగులు, మామిండ్ల శ్రీనివాస్ , బాయికాడీ వెంకటేష్, నర్సింలు, అనిల్, నవీన్ చారి, వివిధ కుల సంఘాల నాయకులు భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking