మంచిర్యాల జిల్లా మూగజీవుల సేవా సంఘం జనరల్ సెక్రటరీకి ఘన సన్మానం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 03 : మూగజీవుల సేవా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కటుకం నాగరాజు ఆధ్వర్యంలో సంఘం సభ్యులందరూ కలిసి హరిప్రసాద్ స్వాతి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా షాలువాతో సత్కరించడం జరిగిందని తెలిపారు.మూగజీవుల సేవా సంఘంలో జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన నాటినుండి నిస్వార్థంగా వేముల హరిప్రసాద్ వారియొక్క సేవలను మూగజీవులకు అందిస్తున్నారని అన్నారు.వేసవిలో మూగజీవులు సరైనా ఆహారం,మంచినీరు దొరకక బాధపడుతున్న విషయాన్ని గ్రహించి కమిటీ సభ్యులతో కలిసి రామకృష్ణపూర్ పట్టణ పరిసర ప్రాంతాలలో మంచినీటి తొట్టిలు దాతల సహాయంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మూగజీవులు ఏవైనా అనారోగ్యంతో మరణించినట్లయితే వాటికి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు కూడ నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్న విషయాన్ని గుర్తుచేసారు. రామకృష్ణపూర్ ప్రాంతంలో మూగజీవుల సేవా సంఘం తరపున పక్షులకు,కోతులకు, కుక్కలకు,ఆవులకు ప్రతిరోజూ రెండు పూటల ఆహారం అందజేసి వాటి ఆకలి బాధ తీరుస్తున్నామని తెలిపారు. మూగజీవుల పట్ల ప్రతిఒక్కరూ కూడ జాలి,దయ,ప్రేమ కలిగి ఉండాలని అవి కూడ మనలాంటి జీవులే అని వాటిని బాధపెట్టడం ఎవరికి మంచిదికాదని హరిప్రసాద్ కోరారు.ఈ కార్యక్రమంలో మూగజీవుల సేవా సంఘం అధ్యక్షుడు కటుకం నాగరాజు,తిరుమలశెట్టి రమణరావు,మర్రి స్వామి,సంగెం శ్రీధర్,రాజసమ్మయ్య,సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking