జమ్మికుంట సిఐ వరగంటి రవి
జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి జూలై 26
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని జమ్మికుంట పట్టణ సీఐ వి రవి సూచించారు. రోడ్లపై త్రిబుల్ రైడింగ్ కానీ సరైన పత్రాలు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా 20 నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి జరిమానా విధించారు. త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి నడిపిన ఎక్కువసార్లు పట్టుపడితే లైసెన్సులు రద్దు అవుతాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై వివేక్, కానిస్టేబుల్ మోహన్, మదన్, ఆనంద్ బ్లూ కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.