వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన దేవాలయం …

తూప్రాన్ లోని ఏకైక ఉత్తర ద్వారా దేవాలయం..

కూర్మ నరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం..
కౌన్సిలర్ మామిళ్ళ జ్యోతి కృష్ణ.

మెదక్ తూప్రాన్ డిసెంబర్ 22 ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తూప్రాన్ రామాలయం సమీపంలో (పోర్తు ) నాలుగోవ వార్డు లో అతి పురాతనమైన ఉత్తర ద్వారా దేవాలయం కూర్మ ..కప్పెర నరసింహస్వామి దేవాలయం సుమారు 100 సంవత్సరాల క్రితం వెలసిన దేవాలయానికి ప్రత్యేక విశిష్టత కలదు.. కోరిన కోరికలు తీర్చే నరసింహ స్వామి దేవాలయం ఘన చరిత్ర కలదు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శించుకుని తమ మొక్కులను కోరికలను స్వామివారికి విన్నవించినచో కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరుపొందిన స్వామి వారిని ఏకాదశి శనివారం దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలు పొందగలరు… వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం ఉదయం ధ్వజారోహణము స్వామివారికి అభిషేకము 108 పుష్పములచే అభిషేకము ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భక్తుల అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాలుగో వార్డ్ కౌన్సిలర్ మామిళ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ నిర్వాహకులు తెలిపారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking