వికలాంగుల కోసం ప్రత్యేక విద్య పాలసీ ఏర్పాటు చేస్తాం

 

…టి వి సి సి చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ

వికలాంగుల విద్యా పర్యవేక్షణ కోసం ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి

..యం అడివయ్య రాష్ట్ర కార్యదర్శి

వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి

….ఎన్ పి ఆర్ డి రాష్ట్ర సదస్సులో వక్తలు*

సంగారెడ్డి/రంగారెడ్డి జూన్ 27 : ప్రజ బలం ప్రతినిధి:
వికలాంగుల విద్య కోసం ప్రత్యేక విద్యా పాలసీ ఏర్పాటు చేస్తామని, వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, *తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ తెలిపారు.
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ, హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జూన్ 27నాడు బధిరుల ఆశజ్యోతి, కవి, రచయిత హెలెన్ కెల్లర్ 144వ జయంతి సందర్బంగా వికలాంగుల విద్యా-స్థితిగతులు -ప్రభుత్వ పాత్ర అనే అంశంపై రాష్ట్ర సదస్సు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్బంగా హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీమతి పి రామిజా బీ మెమోరియల్ అవార్డ్స్-2024 పేరుతో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, కవులు, కళాకారులూ,రచయితలకు 21మందికి అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది.
*ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా టీ వీ సి సి చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ, హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల చైర్మన్ పి ఉమర్ ఖాన్, సహారా డైరెక్టర్ శంకర్ మఠం, టి ఏ ఎస్ ఎల్ పి ఏ రాష్ట్ర అధ్యక్షులు నాగేందర్, కార్యదర్శి ఇమద్ ఖాన్ రూమన్, ఎన్ పి ఆర్ డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె వెంకట్, యం అడివయ్య, ఎంపీడీవో రాష్ట్ర అధ్యక్షులు నల్గొండ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జి వెంకట్ రావు,రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ లు హాజరై ప్రశాంగించారు.
1985లో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ వికలాంగులకు విద్యా కోసం ప్రాంతీయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగుల్లో విద్యా, వృత్తి శిక్షణ, వైద్య పునరావాసం
1987లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్స్ &డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఎలాంటి పురోగతి లేదు. 6-12 ఏండ్లు వయస్సు కలిగిన బాలబాలికలకు ఉచిత విద్యా కల్పించాలని ఉన్నప్పటికీ వికలాంగులకు మాత్రం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర విద్యా పథకం ద్వారా 15-18 వయస్సు కలిగిన వారికి ఉచిత విద్యా అందించాలి.
2010లో ప్రారంభించిన సర్వ శిక్ష అభియాన్ ద్వారా ప్రాథమిక విద్యను వికలాంగులకు ఉచితంగా అందించేందుకు వికలాంగులకు అనుకూలమైన విద్యా నేర్పించడం, సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి కానీ ప్రభుత్వం, ప్రయివేట్ పాఠశాలలు వికలాంగులకు అనుకూలంగా లేవు.తెలంగాణ రాష్ట్రంలో 600 భవిత సెంటర్స్ ఉన్నాయని, వీటిలో కేవలం 12000 మందికే సేవలు అందుతున్నాయని అన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర లలో వికలాంగుల విద్యా కోసం అమలు అవుతున్న సౌకర్యాలు తెలంగాణాలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.సామాజిక మరియు గ్రామీణ పరిశోధన సంస్థ 2014లో వెల్లడించిన నివేదిక ప్రకారం 1.05 శాతం మంది పిల్లలు వైకాల్యం, 2.1 మిలియన్స్ మంది పిల్లలు మానసిక మరియు బహుళ వైకాల్యం కలిగి ఉన్నందున పాఠశాలలకు వెళ్లడం లేదు. 44 శాతం మంది పిల్లలు అభ్యాసన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సమ్మిలిత మరియు సమానమైన విద్యా అందుబాటులో ఉంచడంతో పాటు ఉపాధ్యాయుల వైఖరిలో మార్పు, వారికి ప్రత్యేక విద్యలో సమర్థ్యం పెంచేందుకు నిరంతరం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 6 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడే పాఠశాలల్లో వైఖల్య గుర్తింపు కోసం సర్వే చేయాలి. దేశంలో ప్రజలు నివసించే ప్రాంతాలు వికలాంగుల విద్యాపై తీవ్ర ప్రభావం చూపుతున్నవి
2009-10 సంవత్సరంలో వికలాంగులకు సమగ్ర విద్యా పథకం (IEDS )ద్వారా ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించడం, పుస్తకాలు, ఇతర సౌకర్యాలు కల్పించడం,అందత్వం, వినికిడి లోపం, కుష్ఠు వ్యాధి నయం, తక్కువ ద్రుష్టి, శరీరక వైకాల్యం, అంటీజం, మానసిక వైకాల్యం, మెంటల్ రిటర్డషన్, మస్తీస్కా, పక్షవాతం వంటి వైఖల్యాలు కలిగిన మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలని ఉన్న అమలులో తీవ్రమైన లోపాలు ఉన్నవి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యాక్సెసబుల్ ఇండియా పథకం ద్వారా విశ్వ విద్యాలయలు, సాంకేతిక విద్యా సంస్థలు, సామూహిక ప్రాంతాలు అన్ని రకాల వైఖల్యాలు కలిగిన వికలాంగులు వినియోగించుకునే విదంగా మార్చాలని నిర్ణయం చేసిన ఎలాంటి పురోగతి లేదు.వికలాంగులు అర్థం చేసుకునే విదంగా విద్యా బోధన చేయడం అవసరం. విద్య సంస్థలు వికలాంగులు నివసించే ప్రాంతాలకు దూరంగా ఉండడంవలన డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నవి. మానసిక వైకాల్యం కలిగిన వారికి చదువు చెప్పెందుకు పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి.పర్యావరణంలో వస్తున్న మార్పులు, జన్యుపరమైనా కారణాల వలన వినికిడి లోపం తీవ్రత పెరుగుతుంది.
హెల్త్ వరల్డ్ నివేదిక ప్రకారం మన దేశంలో 18మిలియన్ల మంది ప్రజలు అంటీజంతో ఉంటే, 1-9ఏండ్ల వయస్సు గల పిల్లలో 1.5 శాతం మంది అంటిజంతో బాధపడుతున్నారు. 78శాతం అటిస్టిక్ పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మనదేశంలో 3-17ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలో 17శాతం మంది అంటీజం, అందత్వం మరియు సెరిబ్రల్ పాల్సి వంటి వైఖల్యాలతో ఉన్నారు. 2025 నాటికి ప్రాథమిక పాఠశాలలలో వికలాంగులకు అవసరం అయినా మౌలిక సౌకర్యాలు కల్పించడం అనే లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వం విఫలం చెందింది.
ప్రభుత్వమే ప్రత్యేక విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో స్పెషల్ టీచర్స్ నియమించాలి.
విద్య సంస్థల భవనలు వికలాంగులకు అనుకూలంగా ఉంచాలి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, తరగతి గదులు వికలాంగులకు అనుకూలంగా మార్చాలి
పాఠశాల స్థాయిలోనే వైకాల్యం కలిగిన విద్యార్థులను గుర్తించేందుకు సర్వే చేయాలి.
సాధారణ విద్యార్థులతో వైకాల్యం కలిగిన పిల్లలు కలిసి పోయే విదంగా చర్యలు తీసుకోవాలి
పాఠశాల స్థాయిలోనే అంగవైకల్యం పై విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహనా కల్పించాలి
అంటీజం, సేరిబ్రల్ పాల్సి, మానసిక వైకాల్యం కలిగిన విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి.ఇంటి వద్దనే విద్యా బోధన చెప్పేలా చర్యలు తీసుకోవాలి
సైన్ లాంగ్వేజ్, బ్రేయిలి లిపి అందుబాటులో ఉంచాలి.ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి
బధిరులకు 4జి స్మార్ట్ ఫోన్స్, అంధులకు లాప్టాప్లు ఉచితంగా ఆదాయంతో సంబంధం లేకుండా ఇవ్వాలి
వికలాంగుల విద్యా పర్యవేక్షణ కోసం ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి.
భవిత సెంటర్స్ ద్వారా వైకాల్యం కలిగిన విద్యార్థులకు ఫిజియోతెరపి చేయాలి.
ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగులకు ఇంటిగ్రెటెడ్ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలి.
వికలాంగుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, సిబ్బంది పోస్తులను భర్తీ చేయాలి 2016RPWD, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017,నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్ చట్టలలో ఉన్న అంశాల ప్రకారం వికలాంగుల విద్యా కోసం చర్యలు తీసుకుని, వాటి అమలుకు నిరంతరం పర్యవేక్షణ చేయాలి.ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీ లలో వికలాంగులకు అడ్మిషన్స్ ఇచ్చి వారు చదువుకునేలా ప్రోత్సాహించాలి. వికలాంగుల కోసం స్వచ్చంద సంస్థలు నడుపుతున్న పాఠశాలల్లో చదువుతున్న వైకాల్యం కలిగిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇస్తున్న సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రాజు, కాషాప్ప, మధుబాబు, అరిఫా, బి స్వామి, సహాయ కార్యదర్శులు ఉపేందర్, జె దశరథ్, రాష్ట్ర కమిటీ సభ్యులు భుజంగా రెడ్డి, ప్రకాష్, వెంకన్న, గౌతమ్, సత్యనారాయణలతో పాటు వివిధ జిల్లాల నాయకులు, హెలెన్ కెల్లర్ విద్యా సంస్థ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking