విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరినప్పుడే మాత్రమే ఉపాధ్యాయునికి గుర్తింపు

చేగుంట మండల నోడల్ ఆఫీసర్ నీరజ

చేగుంట, 9 ప్రజాబలం న్యూస్

మెదక్ జిల్ల చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల బదిలీపై వెళ్లిన చక్రధర్ శర్మ,లలిత, శంకర్ సింగ్ రాథోడ్, ఈశ్వరయ్య లకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేగుంట మండల నోడల్ ఆఫీసర్ నీరజ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్య నేర్పిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయులకు సంతృప్తి ఉంటుందని, వివేకానందుడు గొప్పవాడు అయినాడు కాబట్టే రామకృష్ణ పరమహంస కు పేరు వచ్చింది, విద్యార్థులు క్రమశిక్షణగా ఉండి విద్యను అభ్యసించిన మాత్రమే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని వారన్నారు. ఈ కార్యక్రమంలో చల్లా లక్ష్మణ్, మనోహర్ రావు, వెంకటేష్, రాజేశ్వర్, సురేందర్, రాధ, రేఖ, సరస్వతి, రమ, శ్రీవాణి,భవాని,రమాదేవి, సుధాకర్ రెడ్డి, రఘుపతి, సిఆర్పి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking