సెప్టెంబర్ 4తేది నుంచి సెప్టెంబర్ 10వ తేది వరకు
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ వివరాలతో కూడిన దరఖాస్తులను 4 సెప్టెంబర్ నుంచి 10 వ తేదీ 2023 వరకు ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు స్టేట్ ఆఫీస్ ఇవ్వాలన్న బీజేపీ.గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేడు తేదీ 1 సెప్టెంబర్ 2023న హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటనరానున్న శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలతో కూడిన దరఖాస్తులను 4 సెప్టెంబర్ 2023న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో స్వీకరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో నేడు బిజెపి రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్నది.
4 సెప్టెంబర్ 2023 నుండి పదో తారీకు (10సెప్టెంబర్,2023) వరకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించబడును.