ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 28 : లోక్ సభ ఎన్నికలలో భాగంగా జూన్ 04 వ తేదీ న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి అదనపు ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు,సహాయక ఎన్నికల అధికారులు,పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ…లోక్ సభ ఎన్నికలు 2024 లో భాగంగా ఈ నెల 13 న జరిగిన పోలింగ్ కు సంబంధించి జూన్ 4 వ తేదీన జరిగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని, జూన్ 6 వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు హాజరయ్యే ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు,విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేయాలని ఓ.ఆర్.ఎస్. వైద్య సిబ్బంది అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, కేంద్రంలోనికి సరియైన అనుమతి లేని వారిని మొబైల్ ఫోన్లను అనుభవించరాదని తెలిపారు.ట్రాఫిక్ నియంత్రణ,వాహనాల పార్కింగ్ కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ఇతరత్రా ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రౌండ్ల వారీగా ఫలితాలు విలువరించే సమయంలో కౌంటింగ్ కేంద్రం ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా 002 చెన్నూర్, ఎస్.సి 003 బెల్లంపల్లి ఎస్ సి 004 మంచిర్యాల అసెంబ్లీ లో జరిగిన లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కలలోని గల ఐజ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కొరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం కంట్రోల్ రూమ్,మీడియా సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, శాఖ సమన్వయంతో కట్టుదిడ్డమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొని ఎన్నికల అధికారులు,సిబ్బందికి అవసరమైన త్రాగునీరు, ఏర్పాటుతో పాటు నిరంతర విద్యుత్,ఇంటర్నెట్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సి.సి కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి అంశాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని,ఎన్నికల సిబ్బంది, సహాయక సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల్లోని కి వెళ్లేందుకు అవసరమైన అనుమతి పత్రాలను జారీ చేయడం జరుగుతుందని,ఆ ప్రకారంగా పోలీసుశాఖ సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో భరత ఎన్నికల సంఘం నిబంధన మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.డి.పి. అశోక్ కుమార్,జిల్లా అదరపు కలెక్టర్,స్థానిక సంస్థలు బి.రాహుల్,జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్,మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి.రాములు, ప్రత్యేక ఉప పాలనిధికారి ఎల్.ఎ.ఆర్&ఆర్ డి.చంద్రకళ, ఎన్నికల తాహశిల్దార్ శ్రీనివాస్, సమంత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking