యువత మత్తు పదార్థాలకు,మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా చర్యలు తీసుకోవాలి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

నిర్మల్ జిల్లా పాలానాధికారి ఆశిష్ శాంగ్వాన్.శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి నార్కోటిక్ కంట్రోల్ కో ఆర్డినేషన్ కమిటీ యాక్షన్ ప్లాన్ పై సమావేశం నిర్వహించారు. యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా సంబంధిత అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో గంజాయి పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని, దీనికి యువత అలవాటు పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దీనిని మొగ్గలోనే తుంచేయాలని అన్నారు. మాదకద్రవ్యాల కట్టడి పై రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందన్నారు.
మత్తు పదార్థాలకు ముఖ్యంగా యువత ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నందున దీనిని అరికట్టాలని ఆన్నారు.
విద్యా సంస్థలలో డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి వారానికి ఒకసారి సమావేశాలు నిర్వహించి విద్యార్థులకు దీనిపట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రతినెల జిల్లా స్థాయిలో,విద్యా సంస్థలతో పాటు మహిళా సంఘాలు, లోకల్ బాడీలలో కూడా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా రూపొందించాలన్నారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,రైతులు తమ పంట పొలాల్లో గంజాయి మొక్కలు పెంచకుండా వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. గంజాయి పెంచే రైతులకు ప్రభుత్వం నుండి రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అందవని తెలపాలని సూచించారు.జిల్లా సరిహద్దు ప్రాంతాల నుండి మత్తు పదార్థాలు రాకుండా నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. దీని పై అన్ని పాఠశాలలు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా నిర్వహించే ఈవెంట్లలో మాదకద్రవ్యాలు వినియోగించరాదని సూచించారు. జిల్లాలో డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ ఫారెస్ట్ ,ఎక్సైజ్, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పనిచేసి ఎలాంటి సమాచారం అందిన వెంటనే పోలీసు శాఖకు తెలియపరచాలన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన అహ్మద్,ఏ.ఎస్.పి. కాంతిలాల్ పాటిల్, డి.ఎస్.పి,ఎక్సైజ్, ఫారెస్ట్, విద్యాశాఖ,డిఎం అండ్ హెచ్ఓ ,డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అగ్రికల్చర్, రెవెన్యూ, సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking