మెదక్ ప్రజాబలం మే 22 న్యూస్ :-
ఐకెపి కొనుగోలు కేంద్రాలలో దాన్యం నిలువలను ప్రాధాన్యత క్రమంలో ఎగుమతి జరిగేలా చూడాలని ఇందిరా క్రాంతి పదం అధికారులు ఆదేశించిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు
బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐకెపి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు , ధాన్యం కొనుగోలు ఎగుమతి దిగుమతుల లోటుపాట్లపై డిపిఎం ,ఏపీఎంలు సీసీలతో సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఐకెపి కొనుగోలు
కేంద్రాలు జిల్లాలో 108. నిర్వహిస్తున్నట్లు అందులో 25 కేంద్రాలు కొనుగోలు పూర్తిచేసుకుని మూసివేయబడినవని రైతులు దగ్గర నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని లారీలు కొరత ఉన్నప్పటికీ లోకల్ సోర్స్ ను ఉపయోగించి రవాణా చేయించాలన్నారు నాణ్యత గల ధాన్యాన్ని రైతుల దగ్గర నుండి తీసుకుని అంతే నాణ్యత గల ధాన్యాన్ని మిల్లులకు పంపినట్లయితే
సరసమైన ధర లభ్యమై రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ తన దృష్టికి తేవాలని వివరించారు కొనుగోలు కేంద్రాల వారీగా నిర్వాహకుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు,
డి సి ఎస్ ఓ బ్రహ్మ రావు, డి ఎం సివిల్ సప్లై హరికృష్ణ, డిసిఓ కరుణ, సంబంధిత ఐకెపి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఏటీఎంలు సీసీలు పాల్గొన్నారు.