– ఐటీడీఏ పిఓ కి వినతిపత్రం అందజేసిన టిఏజిఎస్ జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య.
భద్రాచలం , నవంబర్ 18, (ప్రజాబలం) :—-
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కి చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామం సంబంధించిన 180 కుటుంబాలు సుమారు 500 ఎకరాల సాగులో ఉన్నాయని ఆదివాసీ పోడు రైతులు మాకు పట్టాలు అయితే వచ్చాయి గాని సరైన పంటలు వేసుకోవడానికి సాగు నీరు అందించడానికి అవకాశం లేదని ఆ భూములకు వ్యవసాయ బోర్లు , త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని. ఐటీడీఏ పీవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని. ఆకాశం మీద ఆధారపడి పత్తి. మిర్చి వేస్తున్నాం అని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ త్రీఫేస్ కరెంట్ సౌకర్యం వ్యవసాయ బోర్లు కు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. గ్రామపంచాయతీలో గ్రామసభ జరిపి మీ సమస్యను పరిష్కారం చేస్తానని ఐటీడీఏ పీవో రాహుల్ హామీ ఇచ్చారని మిడియాకు తెలియజేశారు. చర్ల మండలం విజయ్ కాలనీ సంబంధించిన ఆదివాసి రైతులు రెవెన్యూ పట్టాలు 23 మందికి ఉన్నాయని కానీ సొంతంగా వ్యవసాయ బోర్లు త్రీఫేస్ విద్యుత్ లైన్ ఆదుకోగలరని ఆ ఆదివాసి మహిళా రైతులు పివో ని కోరారు . సానుకూలంగా స్పందించిన ఐటీడీఏ పీవో ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తాం అని అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఏజీఎస్ భద్రాచలం పట్టణ కార్యదర్శి కుంజా శ్రీను, చర్ల మండలం ఐద్వా మండల కార్యదర్శి పొడుపుగంటి సమ్మక్క, ఆదివాసి రైతులు శ్యామల కాంతయ్య, పర్శిక రామ్ కిరణ్, గట్టుపల్లి సురేష్, సోడి నాగమణి ,సోయం రవి, కారం మహేష్, తెల్లం నాగేశ్వరావు, తుర్రం సమ్మక్క ఇంకా తదితరులు పాల్గొన్నారు .