సుర్జిత్ సింగ్ నగర్ గుడిసే వాసులను చేరిన అయోధ్య అక్షితలు

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 4:

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వరంగల్ నగర సంచలన సమితి అధ్యక్షులు చందా రఘువీర్ అధ్యక్షతన గురువారం సూర్జిత్ సింగ్ నగర్ గుడిసె వాసులకు శ్రీరామ పూజిత అయోధ్య అక్షితల వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అయోధ్య నుండి పూజ చేసిన రాముని అక్షతలను గుడిసె వాసులు మంగళ హారతులతో స్వాగతం పలికి వారి వారి ఇళ్లలోకి తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా చందా రఘువీర్ మాట్లాడుతూ ఈనెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభం అవుతున్న సందర్భంగా అయోధ్యలో పూజించబడిన అక్షతలను ప్రతి ఇంటికి చేర్చడమే లక్ష్యంగా అక్షతల వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక బాలాజీ ఆలయ చైర్మన్ సూర్య ప్రకాష్ స్థానిక నాయకులు తౌటమ్ గోపి కేడెం సుజాత, రామకృష్ణారావు గోవర్ధన్ రావు, రవీందర్, మంజుల, కొండమ్మ ,ఉల్లి వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking