అన్ని దారులు బారు గూడెం శ్రీ సిటీ వైపే

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 1 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రజాఅభీష్టం మేరకు పాలన సాగిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్న.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత జిల్లా ముద్దుబిడ్డ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు నూతన సంవత్సరం రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లా, నియోజకవర్గ ప్రజలతో గడపాలని ఆలోచనతో శ్రీ సిటీ లోని నివాసంలో అందుబాటులో ఉండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి తుమ్మల అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఖమ్మం పట్టణ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నత అధికారుల తోపాటు దాదాపుగా పదివేల మంది తుమ్మల గారిని కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపినారు ఉదయం 8:00 గంటల నుండి సందర్శకుల తాకిడితో శ్రీ సిటీ ప్రాంతమంతా జన సమూహంగా మారింది. దాదాపు 6:00 గంటలు వారి నివాసంలో ఏర్పాటుచేసిన వేదికపై నిలబడి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలుపుటకు వచ్చిన అధికారులను, ప్రజా ప్రతినిధులను, పార్టీ నాయకులను,ప్రజలను, అందరిని పేరుపేరునా ఆప్యాయంగా నవ్వుతూ పలకరించినారు దాంతోపాటు పలువురు ప్రభుత్వ అధికారులు, సంఘాల నాయకులు తెచ్చిన కేకులు కట్ చేస్తూ పలు శాఖల మరియు సంఘాల డైరీలు క్యాలెండర్లను ఆవిష్కరించారు.
మరోవైపు పలు ప్రాంతాల నుండి వచ్చిన తుమ్మల గారి అభిమానులు, పార్టీ నాయకులు కార్యకర్తలను అందరికీ ఎటువంటి అసౌకర్యా లు కలగకుండా సకల ఏర్పాట్లతోపాటు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి వచ్చిన వారిని అందరిని ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తూ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking