అర్హులైన అందరూ 6 గ్యారెంటీ ల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 29 (ప్రజాబలం) ఖమ్మం ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని ఒకటవ డివిజన్ టీఎన్జీవోస్ కాలనీ, రాపర్తినగర్ నగర్ లోని ఎస్సి స్టడీ సర్కిల్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని దరఖాస్తుదారులు ముందస్తుగానే తమ దరఖాస్తును నింపి దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లలో అందించాలన్నారు ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6, 2024 వరకు పని దినములలో ప్రతి రోజు ఉదయం 8 గం॥ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు, మధ్యాహ్నం 2 గం॥ల నుండి సాయంత్రం 6 గం॥ల వరకు ప్రజాపాలన సభలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తు ఫారముతో పాటు ఆధార్‌, రేషన్‌ కార్డుల జిరాక్స్ ప్రతులు జతపరచాలని దరఖాస్తుదారునికి తప్పనిసరిగా రశీదు అందించడం జరుగు తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో డిఇ రామారావు, నగరపాలక సంస్థ ఏఇ సతీష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking