బీసీఎన్ (BCN News) న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన
డీఎస్పీ యాదగిరి రెడ్డి,
సీఐ శ్రీధర్ , నలంద విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పివి రమణ ప్రజాప్రతినిధులు.
మెదక్ తూప్రాన్ జనవరి 17 ప్రాజబలం న్యూస్:-
ప్రతిక్షణం పేదల పక్షం బి.సి.ఎన్ న్యూస్ చానెల్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రజా ప్రతినిధులు , సీనియర్ జర్నలిస్టు లు
మెదక్ జిల్లా తూప్రాన్ లో బి.సి.ఎన్ చానెల్ రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం ఉదయం తూప్రాన్ డి.ఎస్.పి యాదగిరిరెడ్డి, సి.ఐ శ్రీధర్, నలంద గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనిట్స్ అధినేత పట్లోరి వెంకట రమణ, సీనియర్ జర్నలిస్ట్ జానకిరామ్ లు గడ్డం ప్రశాంత్ కుమార్ లు అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలాజీ కార్పొరేషన్ నెట్ వర్క్ బి.సి.ఎన్ 24×7 న్యూస్ చానెల్ అధినేత మిద్దెల జితేందర్ సారథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి ప్రసారమైతున్న బి.సి.ఎన్ చానెల్ కు ఆదరణ పెరిగిందని వక్తలు అన్నారు. శాటిలైట్ చానెల్ కు తీసిపోని విధంగా ప్రసారాలు అందిస్తున్న తెలుగు ఛానల్ అని అన్నారు. బి.సి.ఎన్ చానెల్ నిజాలను నిర్భయంగా స్వేచ్ఛగా ప్రతిక్షణం పేదల పక్షం నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్మున్న చానల్ రౌండ్ ద క్లాక్ న్యూస్ అందిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. నూతన సంవత్సర క్యాలెండర్ లో గడ్డం ప్రశాంత్ కుమార్ సేకరించిన యాడ్స్ తో క్యాలెండర్ తో విస్తృతంగా ప్రచారం జరిగిందని అన్నారు. దీనితో బి.సి.ఎన్ రేటింగ్ తోపాటు వ్యువర్ షిప్ విపరీతంగా పెరిగిపోయింది అని అన్నారు. బీసీఎన్ న్యూస్ ఛానల్ 24 * 7 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి మధ్యగా వారధిగా ప్రజా సమస్యలను వెలికి తీస్తున్న ఛానల్ ప్రజా ప్రతినిధుల సేవలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్న అతి తక్కువ టైంలో ప్రజాదరణ పొందుతున్న బీసీఎన్ న్యూస్ ఛానల్ అని ప్రజాప్రతినిధులు తెలిపారు . ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ గడ్డం వెంకట్, పర్వతాలు, విజయ్, ప్రజా ప్రతినిధులు , తూప్రాన్ మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.